భూసార పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ

MP who started soil testing centerనవతెలంగాణ – ధర్మారం
మండలం లోని పత్తిపాక క్రాస్ రోడ్డు వద్ద గంధం ప్రశాంత్ ఏర్పాటు చేసిన భూసార పరీక్షా కేంద్రాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ శనివారం రోజున టెంకాయ కొట్టి తిబ్బని కట్ చేసి భూసార పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గంధం ప్రశాంత్ ను ఎంపీ అభినందిస్తూ, రైతులు ఈ కేంద్రాన్ని ఉపయోగించుకొని, నేల సారం పరిస్థితికి అనుగుణంగా పంటలు వేసుకోవాలని తద్వారా అధిక పంట దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాగిరెడ్డి తిరుపతిరెడ్డి, సీనియర్ నాయకులు అంజయ్య, జనార్ధన్, చిరంజీవి కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.