శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ

నవతెలంగాణ- జక్రాన్ పల్లి

మండలంలోని సికింద్రాపూర్ గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టం కార్యక్రమాన్ని ఎంపీపీ కుంచాల విమల రాజు శ్రీకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సికింద్రాపూర్ లో నిర్వహించే శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమం విడిసి ఆధ్వర్యంలో కొనసాగగా ఎంపీపీ కుంచాల విమల రాజు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తలారి గంగామణి గంగాధర్ వి డి సి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.