ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎంపీడీవో

నవతెలంగాణ కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే రోగుల వివరాలను,  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఏమైనా డెంగ్యూ, చికెన్ గున్యా జ్వరాల కేసులు నమోదయ్యాయ అని మండల వైద్యాధికారి, ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నరసింహ స్వామిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఏ గ్రామంలో కూడా డెంగ్యూ, చికెన్ గున్యా కేసులు నమోదు కాలేదని డాక్టర్ నరసింహ స్వామి ఎంపీడీవో దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ అతని ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. రోగులకు వైద్యం అందించేటప్పుడు తగిన జాగ్రత్తలు వహించాలని, రోగుల పట్ల ప్రేమపూర్వకంగా మెలగాలని పేర్కొన్నారు. నాణ్యతతో కూడిన వైద్య సేవలు అందించడం ద్వారా ఆసుపత్రికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఎక్కువ సంఖ్యల ప్రసవాలు జరిగాల గ్రామాల్లో వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు అవగాహనలు కల్పించాలన్నారు.