పంచాయతీ రికార్డు పరిశీలించిన ఎంపీడీవో..

MPDO examined Panchayat record..నవతెలంగాణ – రాజంపేట్ ( భిక్కనూర్ )
రాజంపేట్ మండలంలోని శివాయిపల్లి గ్రామంలో శనివారం ఎంపీడీవో రఘురాం గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించారు. అనంతరం గ్రామంలోని వాటర్ ట్యాంకులను, నీటి సరఫరాను పరిశీలించి గ్రామ ప్రజలకు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శి అరుణ్ కుమార్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రజిత, పంచాయతీ సిబ్బంది, తదితరులు ఉన్నారు.