నవతెలంగాణ – సారంగాపూర్
మండలంలో జాతీయ ఉపాధి హామీ ఉద్యోగులు జీతాలు ఇప్పించాలని గురువారం ఎంపీడీవో లక్ష్మీకాంతరావుకు వినతి పత్రం అందజేసి మాట్లాడారు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన పథకాలను విజయవంతం చేసేందుకు పండుగలు సెలవులు అనే తేడా లేకుండా రాత్రి పగలు పనిచేశామన్నారు. మా కష్టాన్ని ప్రభుత్వం గుర్తించకపోవడం సకాలంలో వేతనాలు లేక పస్తులున్నామన్నారు. మూడు నెలలుగా జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని, మా సమస్యను ప్రభుత్వ దుస్థితి తీసుకువెళ్లి జీతాలు ఇప్పించాలని ఎంపీడీవో ను కోరమని తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.