
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టి పండ్ల వద్ద వర్క్ సైడ్ బోర్డులు ఏర్పాటు చేయాలని మండలంలోని అన్ని గ్రామాలలో కూలీల సంఖ్య పెంచే విధంగా ఎంపీడీవో అనంత రావు అన్నారు. బుధవారం ఇందల్ వాయి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో అనంతరావు మాట్లాడుతూ 7 రిజిస్టర్ లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని,జిపిడిపి 24-25 గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ పూర్తి చేయాలని, నర్సరీల్లో మొక్కలు పెంచడం, ఎండను తట్టుకోవడానికి సెడ్ నెట్ ను వేసి సంరక్షించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.వచ్చే వేసవిలో గ్రామాల్లో త్రాగునీరుకు ఎలాంటి లోటూ పాట్లు లేకుండా చూసుకోవాలని, గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు, వచ్చే వేసవిలో తాగునీటి కి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కూలీల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని, ప్రస్తుతం జరుగుతున్న పనుల వివరాలు ఎపిఓ పోశేట్టి కి అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ కార్యదర్శులు విధుల పట్ల అంకితభావంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు రాకుండా చుడాలని వివరించారు.ప్రస్తుతం పంచాయతీ లలో ఉన్న వసతుల గురించీ పంచాయతీ కార్యదర్శులకు అడిగి పలు సూచనలు సలహాలు అందజేశారు.గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాగునీటి వసతుల తదితర అంశాలపై వివరాలు తెలుసుకుని పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు శ్రీధర్, నాగేష్ ,భారత్, అరుణ, సువార్త, అనూష, సింగోటం యశ్వంత్,పాశం అశోక్, సుశీల, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కార్యదర్శులు పాల్గొన్నారు.