నవతెలంగాణ – జక్రాన్ పల్లి
జక్రం పెళ్లి గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గా ఇన్చార్జి ఎంపీడీవో బ్రహ్మానందం శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సర్పంచుల పదవీకాలం ముగియడంతో మాజీ సర్పంచ్ ఉప సర్పంచ్లను శాలువాతో సన్మానించారు. శుక్రవారం ఉదయం ఇంచార్జ్ ఎంపీడీవో బ్రహ్మానందం మాజీ సర్పంచ్ ద్వారా బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు గంగారెడ్డి , మరియా సతీష్, మండల కో ఆప్షన్ నెంబర్ బుల్లెట్ అక్బర్ ఖన్, వార్డు సభ్యులు , పంచాయతీ కార్యదర్శి నరేష్ పాల్గొన్నారు.