చిన్నారులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసిన ఎంపీడీఓ..

నవతెలంగాణ – రెంజల్ 

మండల కేంద్రమైన రెంజల్ ప్రైమరీ పాఠశాలలో చిన్నారులకు ఏకరూప దుస్తులతో పాటు, ఉచిత పాఠ్యపుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి గణేష్ రావు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు, ఏపీఎం చిన్నయ్య, పాఠశాల ప్రధాన ఉపధ్యాయురాలు అనురాధ ,కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు ఇందిరా దేవి, మండల సమైక్య అధ్యక్షురాలు లక్ష్మి, సీసీ శ్యామల, సిఏలు , పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.