నవతెలంగాణ – పెద్దవంగర
అడిగిన ప్రతి ఒక్కరికీ జాబ్ కార్డు ద్వారా ఉపాధి హామీ పథకం కింద పని కల్పిస్తామని ఎంపీడీవో వేణుమాధవ్ అన్నారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆయన ఈజీఎస్, తాగునీటి పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ఉపాధి లేదంటూ ఏ ఒక్క కూలీ ప్రశ్నించకుండా, దరఖాస్తు చేసిన ప్రతి కూలీకి ఉపాధి కల్పిస్తామన్నారు. కూలీలకు ప్రతి వారం విధిగా వేతనాలందేట్లుగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వేతనాలు అందలేదనే సమస్య ఎట్టి పరిస్థితుల్లో రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామాల్లోని పల్లె ప్రకృతివనాల్లో ఒక్క మొక్క కూడా ఎండిపోకుండా తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించినట్లు తెలిపారు. వేసవి కాలం దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, టీఏలు తదితరులు పాల్గొన్నారు.