నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీవో సతీష్ కుమార్ మంగళవారం పరిశీలించారు. మండలం లో ని కలిగోటు చింతలూరు చందా మీయాబాగ్ గ్రామాలలో ఉపాధి హామీల కొనసాగుతున్న పళ్ళతోటల పెంపకాలను సీసీటీలను పరిశీలించారు. ఆయన వెంట టెక్నికల్ అసిస్టెంట్ రాంబాబు పలు గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.