కళ్యాపూర్ గ్రామపంచాయతీ  రికార్డులను పరిశీలించిన ఎంపీడీఓ..

MPDO examined Kalyapur Gram Panchayat records..నవతెలంగాణ – రెంజల్ 

రెంజల్ మండలం కళ్యాపూర్ గ్రామపంచాయతీ రికార్డులను ఎంపీడీవో వెంకటేష్ జాదవ్ పరిశీలించారు. గ్రామంలో పరిసరాల పరిశుభ్రత, పై ప్రత్యేక దృష్టిని సాధించాలని ఆయన కార్యదర్శి నవీన్ కు సూచించారు. తాగునీటి ఎద్దడి రాకుండా, వీధి దీపాల ఏర్పాటు తదితర అంశాల పైన ఆయన కార్యదర్శులు అడిగి తెలుసుకున్నారు. గ్రామ ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట సూపరిండెంట్ శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి నవీన్ తదితరులు ఉన్నారు.