
రెంజల్ మండలం కిసాన్ తండా గ్రామంలో మంగళవారం ఎంపీడీవో హెచ్. శ్రీనివాస్ గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించారు. రికార్డులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని కార్యదర్శి సాయిబాబును ఆదేశించారు. అనంతరం గ్రామంలోని నర్సరీని పరిశీలించిన ఆయన ప్రతి ఇంటికి మొక్కలను పంపిణీ చేసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని కార్యదర్శిని ఆదేశించారు. రోడ్లకు ఇరు ప్రక్కల, ప్రతి కుటుంబం ఇంటి వద్దనున్న పెరట్లో మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ భర్త విజయ్, ఉన్నారు.