
రెంజల్ మండలం దు పల్లి గ్రామంలో మురికి కాలువలను శుభ్రం చేస్తుండగా ఎంపీడీవో హెచ్ శ్రీనివాస్ అట్టి పనులను పరిశీలించారు. సీజనల్ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని గ్రామ కార్యదర్శి సలాం ను ఆదేశించారు. మురికి కాలువ నుండి తొలగించిన చెత్తాచెదారాన్ని వెంటనే డంపింగ్ యార్డ్ కు తరలించాలని ఆయన సూచించారు. ప్రతిరోజు గ్రామంలోని పరిసరాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం గ్రామపంచాయతీలో రికార్డులను ఆయన పరిశీలించారు. గ్రామ కార్యదర్శులు తమ వీధులను సక్రమంగా నిర్వర్తించాలని ఆయన పేర్కొన్నారు.