
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామపంచాయతీ కార్మికులకు ఎంపీడీవో గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో వస్త్రాలను అందజేశారు. మిరుదొడ్డి మండల కేంద్రంలోని మహిళ పంచాయతీ కార్మికులకు పంచాయతీ కార్యదర్శి ఫహీమ్ తో కలిసి చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో గణేష్ రెడ్డి మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన మహిళలు సద్వినియం చేసుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ జహీరుద్దీన్, కారోబార్ కుమార్ పలువురు పాల్గొన్నారు.