పాఠశాల ఆవరణలో స్వచ్ఛత కార్యక్రమం చేపట్టిన ఎంపీడీఓ

నవతెలంగాణ -పెద్దవూర
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గురువారం మండలం లోని వెల్మగూడెం ఉన్నత పాఠశాలలో మండల ప్రజా పరిషత్ ఎంపీడీఓ ఉమాదేవి పాఠశాలలో  గడ్డిమొక్కలు తొలగించి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి స్వచ్ఛత కార్య క్రమాన్ని ప్రారంబించారు.ఈసందర్బంగా  పర్యావరణ పట్ల విద్యార్థులుకు అవగాహన కల్పించారు. అనంతరంమాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హరితహారం కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని తెలిపారు. పెరుగుతున్న కాలుష్య నివారణకు మొక్కలు పెంచడమే ఉత్తమ మార్గమని  అన్నారు. మండలం లోని అన్ని పాఠశాలల్లో విస్తృతంగా మొక్కలు నాటేలా చర్యలు చేపడుతున్నామని వాటి సంరక్షణకు కృషి చేయాలని  అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ముంతాజ్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు వసంతకుమార్, హిమవంతరెడ్డి, రామకృష్ణారెడ్డి, రామంజిరెడ్డి, వెంకటయ్య, చైర్మన్ లక్ష్మి సురేందర్ సెక్రటరీ ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు .