
మండలంలోని జంగంపల్లి గ్రామంలో వాటర్ ట్యాంకులను ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి శనివారం పరిశీలించారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామంలో ప్రజలకు నీటి కష్టాలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆర్ డబ్ల్యు ఎస్ ఏఈ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి బాబు కు తెలిపారు. వాటర్ పైప్ లైన్ మరమ్మత్తులు, స్థానిక బోరుబావులను వాటర్ ట్యాంకులకు కలిపి నీటి కష్టాలు తీర్చాలన్నారు. అలాగే ర్యాగట్లపల్లి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సౌజన్య, అంతంపల్లి పంచాయతీ కార్యదర్శి భార్గవి, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు వాటర్ ట్యాంకులను పరిశీలించి పంచాయతీ సిబ్బంది చేత శుభ్రం చేయించి నీటి కష్టాల నివారణ కొరకు ముందస్తు చర్యలు చేపట్టారు.