
మండలంలోని పలు గ్రామాలను జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ శుక్రవారం నాడు సంధర్శించారు. ఈ సంధర్భంగా సావర్ గావ్ తాండా, సానర్ గావ్ గ్రామాలను సంధర్శించారు. తాండాలోని ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యార్థుల హజరు పట్టికను చూసారు. పాఠశాల స్థితి గతుల, గదులు, మద్యహన బోజనం ఏఎపీ పనులను తదితర పరీశీలించడం, ఇతర విషయాల గురించి హెచ్ఎం రేచల్ రాణీ ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం తాండా మరియు గ్రామములోని మురికి కాలువలను వెంటనే సఫాయి కార్మీకులతో శుభ్రం చేయించాలని జీపీ కార్యదర్శికి రవి కి ఆదేశించడంతో వెంటనే శుభ్రంచేసే పనులను ప్రారంబించారు. తరువాత ఖండేభల్లూర్ జీపీ గ్రామాన్ని సందర్శీంచారు. డ్రైడే పాటీంచాలని సూచించారు.