నవతెలంగాణ పెద్దవంగర: మండల పరిధిలోని చిన్నవంగర కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఎంపీడీవో వేణుమాధవ్ సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నెలకొన్న సమస్యలు, భోజన వసతి పై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థులకు ఏర్పాటు చేస్తున్న వంటలను, కూరగాయలను పరిశీలించి, పలు రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలన్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేకాధికారి గంగారపు స్రవంతి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.