
మండలంలోని ఇనాయత్ నగర్, అమీర్ నగర్, నర్సాపూర్ గ్రామాల్లో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలను ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ శుక్రవారం సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన నర్సరీల్లో అవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా నాటేందుకు సిద్ధం చేసిన మొక్కల వివరాలను నర్సరీ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు అవసరమైన మొక్కలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. వన మహోత్సవం, స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాలలో ఆయా గ్రామాల్లో ఇప్పటివరకు ఎన్ని మొక్కలు నాటారు, నర్సరీలో ప్రస్తుతం ఇంకా ఎన్ని మొక్కలు అందుబాటులో ఉన్నాయన్న వివరాలను పంచాయతీ కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు ఇనాయత్ నగర్, నర్సాపూర్ ప్రాథమిక పాఠశాలల్లో మొక్కలు నాటారు.కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు శ్రీలత, జులేఖ, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ కూలీలు, మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.