పాఠశాలల మరమ్మత్తు పనులను పరిశీలించిన ఎంపీడీఓ

నవతెలంగాణ – రెంజల్
మండలంలో ని అంబేద్కర్ నగర్ ఎంపీపీ ఎస్ పాఠశాల మరమ్మత్తు పనులను గురువారం ఎంపీడీవో హెచ్. శ్రీనివాస్ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. చిన్నారుల కు ఇలాంటి అసౌకర్యం కలగకుండా విద్యా బోధన చేయాలని ఉపాధ్యాయులను సూచించారు. ఆయన వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామ కార్యదర్శి సునీల్ యాదవ్ తదితరులు ఉన్నారు.