నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని లాడేగావ్ గ్రామంలో ఎంపీడీవో శ్రీనివాస్ ఇంటింటికి తిరుగుతూ డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులను గుర్తించి ఎంపిక చేసేందుకు గ్రామాలలో పరిశీలన చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామాలలో గతంలో ఇందిరమ్మ ఇల్లు తీసుకున్న వారు కూడా దరఖాస్తులు చేసుకోవడంతో లబ్ధిదారులను గుర్తించడానికి, పకడ్బందీగా ప్రభుత్వం అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి నివేదికలను ఇవ్వాలని కోరడంతో అధికారులు గ్రామాలకు వెళ్లి సర్వేలు నిర్వహించి పై అధికారులకు సంబంధించిన నివేదిక వివరాలను పంపించడం జరుగుతుందని ఎంపీడీవో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జిపి సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు.