క్రీడలతో మానసిక ఉల్లాసం ఎంపిడిఓ రాణి

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండలంలోని కాటేపల్లి గ్రామంలో యువకులు సంక్రాంతి పండుగ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు ఎంపిడిఓ ముఖ్యఅతిథిగా హాజరై టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఎంపిడిఓ క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.ఈ నెల 16వ తేదీ వరకు టోర్నమెంట్ కొనసాగుతుందని పోటీలో గెలచిన జట్టుకు మొదటి, రెండవ బహుమతులు అందజేస్తామని  నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధులు యువకులు క్రీడా కారుల పాల్గొన్నారు.