నవతెలంగాణ – సారంగాపూర్
అర్హులకే పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఎంపీడీవో కాంతారావు,ప్రత్యేక అధికారి అజీజ్ ఖాన్ లు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ వద్ద ప్రజా పాలన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్బంగా అధికారులు ప్రభుత్వం అమలు చేయి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా పథకాలు లబ్దిదారుల జాబితాను చదివి వినిపించారు. లబ్దిదారుల జాబితాలో పేరు లేనివారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం గ్రామ ప్రజలు మీరు చదివిన జాబితాలో ఇండ్లు లేనివారి పేర్లు లేవని అధికారులను నిలదీశారు. మరోసారి సర్వే చేసి అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్పంచిన అధికారులు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి, పరిశించి అర్హులకు ఇండ్లు, రేషన్ కార్డులు మంజూరు చేయడం జరుతుందని అధికారులు తెలపడంతో గ్రామస్థులు చాలా మంది ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల కోసం దాఖస్తులు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ లక్ష్మారెడ్డి, ఏఈఓ అరుణ్, రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్ షేకన్న, గ్రామస్థులు పాల్గొన్నారు.