ఎంపీడీఓ లక్ష్మణరావు పదవీ విరమణ..

– ప్రజలందరి సహకారంతో సాధ్యమైన రీతిలో నా విధులను నిర్వర్తించాను: ఎంపీడీవో, లక్ష్మణరావు
– ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ తప్పదు: ఎమ్మెల్యే వంశీకృష్ణ
నవతెలంగాణ – ఉప్పునుంతల 
ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పదని ఉద్యోగం పొందిన నాటి నుండి పదవి విరమణ అనేది తప్పనిసరిగా ఉంటుందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ఉప్పునుంతల మండలంలో ఎంపీడీవో గా విధులు నిర్వహించిన లక్ష్మణరావు పదవి విరమణ కార్యక్రమాన్ని మండల కేంద్రంలో కొత్త యశోద ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గత 8ఏళ్లుగా ఉప్పునుంతల మండల ఎంపీడీఓ గా బాధ్యతలు నిర్వహించి అందరితో కలిసి మెలసి ఉండి సాటి అధికారుల,ప్రజాప్రతినిధుల మన్ననలు పొందటమే కాకుండా ఉత్తమ ఎంపీడీఓ గా అవార్డు పొందారని ఆయన ప్రశంసించి అభినందించారు.ఎంపీడీఓ మాట్లాడుతూ 8 ఏళ్ల నా సర్వీసులో ఉప్పునుంతల మండల ప్రజలు,తోటి అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తి సహకారం అందించి సహకరించారని అందుకుగాను వారికి కృతజ్ఞతలు అని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.అనంతరం ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తిప్పర్తి అరుణ నర్సింహారెడ్డి, జడ్పీటీసీ అనంత ప్రతాప్ రెడ్డి,సింగిల్ విండో ఛైర్మెన్ సత్తు భూపాల్ రావు,నాయకులు కట్ట ఆనంతరెడ్డి,నర్సింహారెడ్డి,తహశీల్దార్ శ్రీకాంత్, ఎస్ఐ లెనిన్, బల్మూర్ తహసిల్దార్ శైలేంద్ర కుమార్, అచ్చంపేట,బాల్మూర్,వంగూర్,లింగాల మండలాల ఎంపీడీఓలు,ఎంపీడీఓ ఆఫీస్ స్టఫ్,ఆయా గ్రామాల మాజీ సర్పంచులు,ఎంపీటీసీలు, రేషన్ డీలర్లు, తదితరులు పాల్గొన్నారు.