– కుటుంబ వివరాలు సక్రమంగా నమోదు చేయాలి
నవతెలంగాణ మద్నూర్
సమగ్ర కుటుంబ ఇంటింటా సర్వే కార్యక్రమాలను మండల అభివృద్ధి అధికారి రాణి మండల పంచాయతీ అధికారి వెంకట నరసయ్య శనివారం నాడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సర్వే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ప్రతి ఇంటింటా సర్వే నిర్వహించే కుటుంబ వివరాలు సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. మద్నూర్ మండలంలోని మద్నూర్ గ్రామంలో ఆ గ్రామ పంచాయితీ అధికారి మనోహర్ చేపడుతున్న ఇంటింటా సర్వే కార్యక్రమాలను ఎంపీడీవో ఎంపీవో పరిశీలించారు.