
మండలంలోని మహమ్మదాబాద్ గ్రామములోని వైకుంఠ ధామంలో ఎంపీడీవో శ్రీనివాస్ వనమహోత్సవంలో భాగంగా శనివారం నాడు మెుక్కలు నాటడం జర్గిందని గ్రామ పంచాయతి కార్యదర్శి జీవన్ తెలిపారు. ఈ సంధర్భంగా ఎంపీడీవో మాట్లాడుతు గ్రామాలలో రోడ్ల వెంట ఖాళీ స్థలం లో, ప్రభూత్వ భూములలో మెుక్కలు నాటాలని, వాటిన సంరక్షణ చేయాలని, మెుక్కలు పెర్గి మహవృక్షాలుగా రూపాంతరం చెందుతాయని, మావన మనుగడకు వృక్షాలు చాలా అవసరం అని , గ్రామములో ప్రతి ఒక్కరు ఆరు మెుక్కలు నాటే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. వన మహోత్సవం కార్యక్రమాలలో గ్రామస్తులను బాగస్వాములు చేయాలని జీపీ కార్యదర్శి జీవన్ ను ఆదేశించారు. గ్రామములో చెత్తచేదారం లేకుండా ఎప్పడికప్పుడు శుభ్రం చేసి శానీటేషన్ చేయాలని, పశువులు తాగే నీటీ తొట్టిని , మురికికాలువలను ఎంపీడీవో దగ్గరుండి శుభ్రం చేయించారు. కార్యక్రమంలో జీపీ సెక్రట్రి జీవన్, తదితరులు పాల్గోన్నారు.