పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం కోసం భూమి పూజ చేసిన ఎంపీడీవో రాణి 

నవతెలంగాణ-  పెద్దకొడప్ గల్
మండలంలోని  కాస్లాబాద్ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం కొరకు స్థానిక నాయకులతో కలిసి ఎంపీడీఓ రాణి కొబ్బరి కాయలు కొట్టి భూమి పూజ  చేశారు. అనంతరం ఎంపీడీఓ రాణి మాట్లాడుతూ.. ఎన్ ఆర్ఇజిఎస్ పథకంలో ప్రహరీ గోడ నిర్మాణం కొరకు ప్రభుత్వం రూ.14.85 లక్షల నిధులను మంజూరు చేసిందని తెలిపారు. అంతేకాకుండా ప్రహరీ గోడ నిర్మాణంలో  నాణ్యత పాటించి, పనులు చెయ్యాలని సదారు గుత్తేదారును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపిఓ సూర్యకాంత్, పంచాయతీ రాజ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి,పంచాయతీ కార్యదర్శి జ్యోతి,ఎంపిటిసి సాయిలు,గ్రామ పెద్దలు హన్మండ్లు, హైమద్,తదితరులు పాల్గొన్నారు.