మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ ఆవరణంలో 78వ స్వతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా కార్యాలయ ఆవరణంలో జాతీయ పతాకాన్ని పంచాయతీ ప్రత్యేక అధికారి మద్నూర్ మండల అభివృద్ధి అధికారి రాణి ఎగరవేశారు. ఈ స్వతంత్ర వేడుకలకు గ్రామ పెద్దలు వ్యాపారవేత రామ్ సుక్ బాల్ ముకుందు ఈనాని ఇనాని కుటుంబ సభ్యులతో పాటు పంచాయతీ మాజీ సర్పంచ్ మాజీ వార్డ్ సభ్యులు గ్రామ పెద్దలు వివిధ పార్టీల ముఖ్య నాయకులు గ్రామ కార్యదర్శి సందీప్ కుమార్ పంచాయితీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.