నవతెలంగాణ-పెద్దకొడప్ గల్: పేద ప్రజల గొంతుక నవతెలంగాణ అని పెద్దకొడప్ గల్ ఎంపీడీవో రాణి అన్నారు. శుక్రవారం రోజున మండల పరిషత్ కార్యాలయంలో నవతెలంగాణ దినపత్రిక క్యాలెండర్ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద ప్రజలకు అవసరమైన విషయాలను వారి కష్టాలను ఎప్పటికప్పుడు వెలికిస్తూ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొస్తూ వారి సమస్యల పరిష్కారానికి నవ తెలంగాణ కృషి చేస్తుందన్నారు. అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ ప్రజల సమస్యలు తీర్చకుంటే నిర్భయంగా ప్రజల వైపు ఉంటూ ప్రజలకు న్యాయం జరిగే విధంగా పత్రిక కృషి చేస్తుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సురేకాంత్, విట్టల్, ఆయా గ్రామాల పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.