దోస్పల్లిలో ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ పరీశీలించిన ఎంపిడివో

నవతెలంగాణ – జుక్కల్: మండలంలోని దోల్పల్లి జీపీలో గ్రామ సర్పంచ్ సునితా పటేల్ అద్యక్షతన ఆరు గ్యారంటీల హమీలో భాగంగా గ్రామస్తుల నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రశాంతంగా కోనసాగీందని గ్రామ పంచాయతి కార్యదర్శి జాదవ్ మనోహర్ తెలిపారు. ఈ సంధర్భంగా ఎంపిడివో నరేష్, గ్రామ సర్పంచ్ సునితా పటేల్, మాట్లాడుతు గ్రామస్తులకు త్రాగునీరు, టెంట్ నీడ, దరఖాస్తు కోదువ పడకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఎంపిడివో నరేష్ వివరించారు. దరఖాస్తుల స్వీకరణలో భాగంగా బాద్యతతో ప్రజలతో అధికారులు మెలగాలని సూచించారు, ప్రజలతో మేజర్ సమస్యలుంటే తన దృష్టికిి తేవాలని, అదేవిధంగా దరఖాస్తు ఫారాలను డబ్బులు తీసుకోని అమ్మకాలు చేసే వారిపైన క్రిమినల్ కేసులు నమేాదు చేస్తామని హెచ్చరించారు. ఆరు గ్యారంటిల హమీలో మంచి సేవ చేసి ప్రజారంజకంగా ఉంటుందని, అందరి సహకారంతో ప్రజాపాలన పాలన దరఖాస్తుల స్వీకరణ వ చేపట్టాలని పేర్కోన్నారు.