నవతెలంగాణ – భీంగల్
గ్రామాలలో త్రాగునీటి ఎద్దడి లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో సంతోష్ కుమార్ గ్రామపంచాయతీ కార్యదర్శులకు సూచించారు. శుక్రవారం మండలంలోని పెద్దమ్మ కాడి తండా సికింద్రాపూర్, గోన్ గొప్పల గ్రామపంచాయతీలను ఎంపీ ఓ గంగ మోహన్ ఏపీఓ నర్సయ్యతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులతో త్రాగునీటి పై సమీక్ష నిర్వహించారు. రానున్న వేసవికాలం ని దృష్టిలో ఉంచుకొని గ్రామాలలో త్రాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే నర్సరీల పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గోనుగోప్పుల గ్రామంలో ఎంపీడీవో సంతోష్ కుమార్ ను టిఆర్ఎస్ నాయకుడు చారి సన్మానించారు.