విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని జన్నారం మండల ఎంపీడీవో శశికళ సూచించారు. బుధవారం జన్నారం పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, నిర్వాహకులతో ఆమె మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన చదువుతో పాటు మంచి భోజనం పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జన్నారం ఎంపీఓ జలంధర్, పోన్కల్ ఈవో రాహుల్, పంచాయతీ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.