నర్సరీ పెంపకం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి: ఎంపీడీవో సతీష్ కుమార్

నవతెలంగాణ – జక్రాన్ పల్లి

నర్సరీ పెంపకం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీవో సతీష్ కుమార్ మంగళవారం అన్నారు.  మండలం లోని ఆర్గుల్ గ్రామం లో ని నర్సరి ని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. పళ్ళ మొక్కలు ఇతర మొక్కల పట్ల జాగ్రత్తల వహిస్తూ ప్రొద్దున సాయంత్రం నీళ్లు సక్రమంగా పట్టాలని పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ కు సూచించారు. ఆయన వెంట ఏపిఓ రవి ఉన్నారు.