నవతెలంగాణ – రామారెడ్డి
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ కూలీలు ఉదయాన్నే పనికి వెళ్లి, ఎండ తీవ్రత అయ్యేలోపే ఇండ్లల్లోకి రావాలని స్థానిక ఎంపీడీవో సవితారెడ్డి సోమవారం కూలీలకు సూచించారు. మండలంలోని మద్దికుంటలో ఉపాధి హామీ నూతన సంవత్సర పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీవో ధర్మారెడ్డి మాట్లాడుతూ… కొలతల ప్రకారం పనులు నిర్వహించి, పనికి తగిన వేతనాన్ని పొందాలని, పని ప్రదేశంలో నీటిని అందుబాటులో ఉంచుకోవాలని, పనికి హాజరు కాని వారిని, ఫోటోలో లేని వారికి కూలి డబ్బులు రావని, తప్పకుండా మొదటి ఫోటో, రెండో ఫోటో మధ్య కాలవ్యవధి నాలుగు గంటల సమయం ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు చిన్న స్వామి, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.