వైకుంఠధామ స్థలానికి చెక్కు అందజేసిన ఎంపీడీవో సవితారెడ్డి

నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని మోషన్ పూర్ గ్రామానికి చెందిన ఎరుకల సాలవ్వ గ్రామ వైకుంఠ దామం నిర్మాణానికి తన సొంత స్థలం 15 గుంటలు గ్రామపంచాయతీ ఇవ్వడంతో, కలెక్టర్ జితీష్ వి పాటిల్ ఆమెకు రూ నాలుగు లక్షల 50 వేల విలువ గల చెక్కును మంజూరు చేయగా, చెక్కును సోమవారం ఎంపీడీవో సవితా రెడ్డి సాలవ్వకు అందజేశారు. సంబంధిత 15 గంటల భూమి గ్రామపంచాయతీ పేరు రిజిస్ట్రేషన్ చేయించారు. కార్యక్రమంలో సాలవ్వ కుటుంబ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి నరేష్, రంగంపేట పంచాయతీ కార్యదర్శి రవి తదితరులు ఉన్నారు.