నర్సరీలను పరిశీలించిన ఎంపీడీవో శంకర్

నవతెలంగాణ – రెంజల్

రెంజల్ మండలం కూనేపల్లి, కిసాన్ తాండ గ్రామాలలో నర్సరీలను ఎంపీడీవో శంకర్ పరిశీలించారు. ప్రతి గ్రామంలో నర్సరీల పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన క్షేత్రస్థాయికులకు సూచించారు. నర్సరీల పెంపకంపై అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రతిరోజు నరసరీలకు నీటిని అందించే చర్యలను చేపట్టాలన్నారు. ఆయన వెంట సూపర్డెంట్ శ్రీనివాస్, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.