ప్రజా పాలనపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఎంపీడీవో శంకర్

నవతెలంగాణ రెంజల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలపై ఎంపీడీవో శంకర్ ప్రజలకు అవగాహన కల్పించారు. శుక్రవారం మండల కేంద్రమైన రెంజల్ రైతు వేదికలో సర్పంచ్ ఎమ్మెస్ రమేష్ కుమార్ అధ్యక్షతన ప్రజా దర్బార్ ను ఏర్పాటు చేశారు. నిరుపేదలైన కుటుంబాలకు చేయూతనందించాలన్న తలంపుతో ప్రభుత్వం ఆరోగ్యానికి పథకాలకు శ్రీకారం చుట్టింది. ప్రతి ఇంటికి ప్రజా పాలన దరఖాస్తులను అందజేసి, కౌంటర్ల ద్వారా దరఖాస్తులను కొట్టివేతలు లేకుండా, సిబ్బందితో వాటిని పూర్తి చేయించారు. సిబ్బంది ఇలాంటి ఒత్తిడి లకు గురికాకుండా దరఖాస్తు ఫారాలను నింపి ప్రజలకు సహకరించాలని సర్పంచ్ ఎమ్మెస్ రమేష్ కుమార్, ఎంపిపి రజిని కిషోర్ లు సిబ్బందిని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ శ్రీనివాస్, రెవెన్ ఇన్స్పెక్టర్ రవికుమార్, గ్రామ కార్యదర్శి రాజేందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

నీలా, బాగేపల్లి గ్రామాలలో…
మండలంలోని నీల గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ గౌరాచి లలితా రాఘవేందర్ అధ్యక్షతన ఆరు గ్యారెంటీ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలోని ప్రతి నిరుపేద కుటుంబాలకు ప్రజా పాలన దరఖాస్తులను అందజేసి, ప్రత్యేక కౌంటర్ల ద్వారా వారికి సహాయ సహకారాలను అందించాలని వారన్నారు. మహాలక్ష్మి పథకం, పింఛన్, గృహలక్ష్మి, రైతుబంధు, గృహ జ్యోతి పథకం, ఇందిరమ్మ ఇండ్ల పథకం తదితర పథకాల లబ్ధి పొందడానికి ఇవి ఎంతో ఉపకరిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు యోగేష్, ఎంపీటీసీ గడ్డం స్వప్న రామచంద్రర్ గ్రామ కార్యదర్శి బి. రాణి, కారోబార్ రమేష్, అంగన్వాడి కార్యకర్తలు ఆశలు పాల్గొన్నారు.

బాగేపల్లి గ్రామంలో...
రెంజల్ మండలం బాగేపల్లి గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమంలో ఆరు గ్యారెంటీ పథకాలపై తాసిల్దార్ రామచందర్ అవగాహన కల్పించారు. సర్పంచ్ పాముల సాయిలు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గృహలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు చేయుత పథకాల గురించి వివరించడమే కాకుండా, నిరుపేదలకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి పూర్తిచేసిన దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ గౌస్ ఉద్దీన్, వ్యవసాయ అధికారి లక్ష్మీకాంత్ రెడ్డి, ఏపీఎం భాస్కర్, వ్యవసాయ విస్తీర్ణ అధికారి గోపికృష్ణ, స్థానిక నాయకులు సురేందర్ గౌడ్, సాయిబాబా గౌడ్, రామ కార్యదర్శి శ్రీకాంత్, అంగన్వాడి కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశలు పాల్గొన్నారు.