సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎంపీడీవో

People are seasonal in the context of monsoonsనవతెలంగాణ – పెద్దవంగర
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో వేణుమాధవ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఇటీవల కురుస్తున్న వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిసర ప్రాంతాలలో నీటిని నిల్వ ఉండకుండా చూసుకోవాలని, లేదంటే నీటిలో దోమలు వృద్ధి చెందే ప్రమాదం ఉందన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. నీటి ద్వారా వచ్చే వ్యాధులను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు అధికంగా వచ్చే ప్రమాదం ఉన్నందున రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లొద్దన్నారు. ఫంగల్‌ ఇన్ఫెక్షన్ల నివారణ కోసం కాచివడబోసిన నీటినే తాగాలన్నారు. దోమలు దరిచేరకుండా దోమ నిరోధకాలు, దోమ తెరలు వాడాలని తెలిపారు, చిన్నపాటి జ్వరం వచ్చినా ఆసుప్రతికి వెళ్లి వెద్యులను సంప్రదించాలని కోరారు. సీజనల్‌ వ్యాదులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఎం రమణాచారి, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.