వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలి: ఎంపీడిఓ

నవతెలంగాణ – పెద్దవూర
వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని మండల ఎంపీడీఓ వర్కాల మోహన్ రెడ్డి మిషన్‌ భగీరథ అధికారులకు, కార్యదర్శులకు సూచించారు. శుక్రవారం మండలం లోని ఎంపీడీఓ కార్యాలయం లో మిషన్ భగీరథ, ప్రత్యేక అధికారులకు, కార్యదర్శిలకు నిర్వహించిన సమీక్షా సమావేశం లో మాట్లాడారు.ప్రభుత్వం కోట్లాది రూపాయల వ్యయంతో వేలాది కిలోమీటర్ల ప్రధాన వాటర్‌ పైప్‌లైన్లు, ఓహెచ్‌ఎ్‌సఆర్‌ల నిర్మాణం, ఇంటింటికీ నల్లాల బిగింపు పూర్తయి ప్రతీ ఇంటికి తాగునీటిని అందిస్తుందని అన్నారు. ప్రభుత్వ ఆశయం మేరకు ఇంటింటికీ శుద్ధమైన తాగునీరు అందించేందుకు అధికారులు  కృషి చేయాలని కోరారు.వేసవి రానున్నందున ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు కలుగకుండా సంబదిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ప్రణాళికాబద్ధంగా పనిచేసి, లీకేజీలు లేకుండా చూసుకోవాలన్నారు. నీటిని విడుదల చేసేటప్పుడు మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా చేసేందుకు అవసరమైన నీరు లభ్యమయ్యేలా చూసుకోవాలన్నారు. గృహాలతో పాటు విద్యాసంస్థలు, హాస్టళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు నిరంతరం నీరు అందేలా చూడాలన్నారు.చిన్న చిన్న లీకేజీలు ఉంటే గ్రామపంచాయతీ నిధులు వెచ్చించి మరమ్మత్తులు చేపట్టాలని తెలిపారు. పెద్ద స్థాయిలో లీకేజీలకు గాను ఎంఎల్ ఏ సహకారం తో  ప్రతి మండలానికి ఆర్ డబుల్యూ ఎస్ నుంచి నిధులు విడుదల చేయుటకు కృషి చేస్తుందని తెలిపారు. అనిధుల తో మేజర్ గా తాగునిటీకి ఇబ్బందులు కలుగకుండా వినియోగించుకోవాలని తెలిపారు. అలాగే హరితహారం లో భాగంగా వేసవి లో చెట్లు ఎండిపోకుండా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ల సహాయం తో నీటిని పోయాలని అన్నారు. ముఖ్యంగా మండల ప్రజలకు.తాగునిటీకి ఎలాంటి ఇబ్బంది కలుగుకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలం ప్రత్యేక అధికారులు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.