
మండల పరిధిలోని ప్రతి గ్రామ పంచాయితీ లొని 50 మంది ఉపాధి హామీ కూలీలు తగ్గకుండా పనికి వచ్చేలా చూడాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు అన్నారు. పంచాయతీ రాజ్ కమీషనర్ జిల్లా కలెక్టర్లతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రతి గ్రామంలో రోజూ 50 మందికి తగ్గకుండా కూలీల రాకుంటే సంబందిత యంపిడిఓ, యంపిఓ, ఏపిఓ, పంచాయతీ కార్యదర్శులు టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్ల పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో శనివారం పంచాయతీ కార్యదర్శులు టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లతో సమీక్ష జరిపి ప్రతి గ్రామంలో ఉదయం కూలీలతో మాట్లాడి రేపటి నుంచి పనికి వచ్చేలా చూడాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి యం శ్రీనివాస్ రావు, ఏపిఓ మోరె కుమారస్వామి, టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గోన్నారు.