వన మహోత్సవానికి మొక్కలను సిద్ధంగా ఉంచాలి: ఎంపీడీఓ

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
త్వరలో చేపట్టబోయే వన మహోత్సవంలో భాగంగా నాటేందుకు అవసరమైన మొక్కలను సిద్ధంగా ఉంచాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అన్నారు. శనివారం మండలంలోని ఉప్లూర్ లో  గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీని  ఆయన సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు కురుస్తున్నందున గ్రామంలో నాటేందుకు  నిర్దేశించిన లక్ష్యం మేరకు నర్సరీలో  మొక్కలను సిద్ధంగా ఉంచాలన్నారు. గతంలో హరితహారంలో నాటిన మొక్కలు చనిపోయిన, ఎండిపోయిన చోట కొత్త మొక్కలను నాటించాలని ఈజిఎస్ సిబ్బందికి సూచించారు. నాటిన మొక్కల్లో 60 శాతం పైగా మొక్కలు బతికేలా తగిన చర్యలు చేపట్టాలన్నారు. నర్సరీ నిర్వహణ పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. నర్సరీలో ఏ ఏ రకాల మొక్కలను సిద్ధం చేస్తున్నారని నర్సరీ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఉపాధి హామీ పథకంలో భాగంగా కొనసాగుతున్న పనులను, మిషన్ భగీరథ తాగునీటి సర్వే పునర్ పరిశీలన కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ ప్రత్యేక అధికారి, డిప్యూటీ తహసిల్దార్ భాస్కర్, పంచాయతీ కార్యదర్శి నరేందర్, తదితరులు పాల్గొన్నారు.