పర్యావరణాన్ని కాపాడాలి: ఎంపీడీఓ

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మొక్కలు నాటి సంరక్షించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడాలని ఎంపీడీఓ చింత రాజ శ్రీనివాస్ అన్నారు. బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని  మండలంలోని ఉప్లూర్ గ్రామ పరిధిలోని నక్కలోడి కుంట సమీపంలోని అమృత్ సరోవర్ పాయింట్ వద్ద జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన ప్రాణవాయును అందించాలంటే పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉందన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతలను తీసుకోవాలన్నారు. ప్రస్తుతం మనము నాటి సంరక్షించే మొక్కలే వృక్షాలై భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన ప్రాణవాయువు  అందించేందుకు ఎంతగానో దోహదపడతాయన్నారు. అనంతరం మొక్కలు నాటి, సంరక్షించి పర్యావరణాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో ఈజిఎస్ ఏపీవో విద్యానంద్, టెక్నికల్ అసిస్టెంట్ మంజు రాణి, పంచాయతీ కార్యదర్శి నరేందర్, ఫీల్డ్ అసిస్టెంట్ అశ్వపతి, ఉపాధి హామీ కూలీలు, తదితరులు పాల్గొన్నారు.