మండలంలోని అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎంపీడీవో సతీష్ కుమార్ సోమవారం అన్నారు. మండలంలోని అర్గుల్ జక్రాన్పల్లి ప్రాథమిక పాఠశాలలో సందర్శించి అమ్మ ఆదర్శ కమిటీలకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఏ ఇ, సూపర్డెంట్ బ్రహ్మానందం, ఏపిఎం రవీందర్ రెడ్డి, పలు గ్రామాల గ్రామ సంఘం అధ్యక్షులు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు ఉన్నారు.