గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా విశిష్ట సేవలను అందించాలని ఎంపీడీవో అనిల్ కుమార్ బదిలీపై వచ్చిన ఎంపీఓ, కార్యదర్శిలను కోరారు.నీడికుడ మండలంలో ఎంపీఓగా విధులు నిర్వహించిన సయ్యద్ అఫ్జల్ బదిలీపై మండల ఎంపీఒగా శుక్రవారం చార్జ్ తీసుకున్నారని,అలాగే 5 గ్రామాల కార్యదర్శులు నూతనంగా వీధిలోకి చేరారని తెలిపారు.ఈ సందర్భంగా మండల కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది వారిని పుష్ప గుచ్చలతో సాధారణ ఆహ్వానించి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మసాగర్ మేజర్ గ్రామపంచాయతీకి కొత్తగూడ గ్రామంలో కార్యదర్శి విధులు నిర్వహించిన రమేష్, సాయి పేట గ్రామానికి నందనంలో విధుల నిర్వహించిన వెంకన్న, తాటికాయల గ్రామానికి అప్పన్నపల్లిలో విధులు నిర్వహించిన చామంతి, కరుణాపురం గ్రామానికి దామెర గ్రామంలో విధులు నిర్వహించిన పద్మ, ధర్మపురం గ్రామానికి వేలేర్ గ్రామంలో విధులు నిర్వహించిన భాస్కరులు చార్జి తీసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరు తమ వంతు విశిష్ట సేవలను అందించి మండల అభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా వారు కోరారు. కార్యక్రమంలో ఏపీఓ సంపత్, సీనియర్ అసిస్టెంట్ గ్రామపంచాయతీ ఆపరేటర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.