ప్రజావాణి’ని సద్వినియోగం చేసుకోవాలి: ఎంపీడీఓ

'Prajavani' should be utilized: MPDO– ప్రజావాణిలో ఆర్జీలు స్వీకరిస్తున్న ఎంపీడీఓ
నవతెలంగాణ – పెద్దవూర
ప్రజావాణి అనేది గొప్ప కార్యక్రమమని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మండల ఎంపీడీఓ మహమ్మద్ ఆఫీజ్ ఖాన్ అన్నారు. సోమవారం మండల కేంద్రం లోని ప్రజా పరిషత్ కార్యాలయం లో నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ.. ప్రజావాణిలో స్వీకరించిన ఆయా ఫిర్యాదులకు, ఆర్జీలకు సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కార మార్గం చూపుతారని తెలిపారు. ప్రజావాణికి మొత్తం 42 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను క్షణ్ణంగా పరిశీలించితర్వాతే సమస్యలు పరిష్కరిస్థామని తెలిపారు. ఈ కార్యక్రమం లో తహసీల్దార్ సరోజ పావని,ఎంపీఓ విజయ కుమార్,ఏఓ సందీప్,ఎంఎస్ఓ సాలయ్య, ట్రాన్స్ కో ఏ ఈ, దాసు,ఆర్ డబ్ల్యూ ఎస్ ఏఈ దీక్షిత్,సాగర్ మున్సిపల్ అధికారీ అర్చన, ఐసీడీఎస్ సూపర్ వైజర్లు వెంకాయమ్మ, గౌసియా బేగం,ఏపీ ఓ లలిత,వ్యవసాయవిస్తరణ అధికారీ తనూజ,
కార్యదర్శులు ,తదితరులు పాల్గొన్నారు.