
ప్రజావాణి అనేది గొప్ప కార్యక్రమమని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మండల ఎంపీడీఓ మహమ్మద్ ఉమాదేవి అన్నారు. సోమవారం మండల కేంద్రం లోని ప్రజా పరిషత్ కార్యాలయం లో నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజావాణిలో స్వీకరించిన ఆయా ఫిర్యాదులకు, ఆర్జీలకు సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కార మార్గం చూపుతారని తెలిపారు. ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. సమర్థవంతంగా పారిశుధ్య నిర్వహణతో ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని, గ్రీనరీ పెంచడం ద్వారా కాలుష్యం తగ్గుతుందని, పర్యావరణ సంరక్షణ సాధ్యమవుతుందని, ఈ లక్ష్యాలతో ప్రభుత్వం స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు.మండలం ప్రతి గ్రామంలో స్వచ్చదనం-పచ్చదనం కార్యక్ర మాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు.నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం తాగు నీటి సరఫరా, ఇంకుడు గుంతల నిర్మాణం, మురికి కాల్వలను, నీటి నిల్వ ప్రాంతాలను శుభ్రం చేయడం, రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చడం, సీజనల్ వ్యాధుల నియంత్రణ పై అవగాహన,ప్రభుత్వ సంస్థలను శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమం లో తహసీల్దార్ సరోజ పావని,సూపరిండెంట్ హఫీజ్ ఖాన్,ఏంపీఓ విజయ కుమార్,ఏఓ సందీప్, ట్రాన్స్ కో ఏఈ, దాసు,ఆర్ డబ్ల్యూ ఎస్ ఏఈ దీక్షిత్,సాగర్ మున్సిపల్ అధికారీ అర్చన, ఐసీడీఎస్ సూపర్ వైజర్లు వెంకాయమ్మ, గౌసియా బేగం,ఏపీ ఓ లలిత,వ్యవసాయవిస్తరణ అధికారీ తనూజ,రాము,కార్యదర్శులు ,తదితరులు పాల్గొన్నారు.