
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన 6 గ్యారంటీల అమలులోని గృహజ్యోతి మరియు మహాలక్ష్మి పథకాల కొరకు వివరాల సవరణలకు దరఖాస్తు, నూతన అభయహస్తం దరఖాస్తు స్వీకరణలకు ప్రజా పాలన సేవా కేంద్రాన్ని మండల ప్రజా పరిషత్ చివ్వెంలలో ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో చక్రాల సంతోష్ కుమార్ తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమం లో సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ నాయుడు , జూనియర్ అసిస్టెంట్ దిలీప్, టైపిస్ట్ మల్లేష్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.