ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎంపీడీవో

అలంపూర్‌: ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎంపీడీవో జబ్బార్‌ సూచించారు. మంగళవారం అలంపూర్‌ మండల ఎంపీడీవో కార్యాలయంలో వికలాంగులకు, వద్ధులకు ఓటు వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లా డుతూ ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛం దంగా, తమకు నచ్చిన అభ్యర్థికి ఓటును వేసుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారి రమేష్‌ బాబు, సీడీపీిఓ సుజాత, డీఆర్డీఓ రూతమ్మ, ఏపీఎం ప్రవీణ, సీసీలు, వీవోఏలు, అంగన్వాడీలు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.