నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి: ఎంపీడీవో

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
ప్రజలు  నీటిని వృధా చేయకుండా, పొదుపుగా వాడుకోవాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని, నాగపూర్ గ్రామంలో పలు కాలనీలో ఉన్న వాటర్ ట్యాంకులను, మినీ వాటర్ ట్యాంకులను  ఆయన పరిశీలించారు. నీటి సమస్యలపై పలు నివాస గృహాలను సందర్శించి ప్రజలతో మాట్లాడి నీటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు ఆయన నాగపూర్ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు పాటించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ఎక్కడైనా పైప్ లైన్ మరమ్మతులు ఉంటే తక్షణమే మరమ్మతులు చేయించాలన్నారు. తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడే  పరిస్థితి లేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనులపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయన్నతో చర్చించారు.  ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు శాంతి కుమార్, సంధ్య, తదితరులు పాల్గొన్నారు.