మల్లారం పంచాయతీ రికార్డులు తనిఖీ చేసిన ఎంపిడిఓ శ్యామ్ సుందర్

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని మల్లారం గ్రామపంచాయితీలో మంగళవారం మండల ఎంపిడిఓ శ్యాం సుందర్  గ్రామపంచాయతీ కార్యాలయం సందర్శించి వాటర్ సప్లైకి సంబంధించి సెవెన్ రిజిస్టర్స్, ఎంజీఎన్ఆర్ఇజిఎస్, సెవెన్ రిజిస్టర్స్ తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడారు వేసవికాలం సందర్భంగా చలివేంద్రం, హ్యాండ్ పంప్ రిపేరు చేపట్టాలన్నారు. నర్సరీ లోని మొక్కలు ఎదుగుదలకు తగు సలహాలు, సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చేలకల రాజు యాదవ్, కారోబార్ శ్రీకాంత్ పాల్గొన్నారు.